Indian captain Virat Kohli has been asked by the Board of Control for Cricket in India’s Committee of Administrators (COA) to behave with humility during interactions with both media and the public.
#IndiavsAustralia201819
#ViratKohli
#coa
#bcci
ఆస్ట్రేలియా పర్యటన ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ను ఆడేందుకు కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా శుక్రవారం ఆసీస్‌కు బయల్దేరింది. ఈ ప్రయాణానికి ముందు బీసీసీఐ పాలకుల కమిటీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ అభిమానిని విరాట్ కోహ్లీ 'దేశం విడిచి వెళ్లిపో' అని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని సృష్టించిన నేపథ్యంలో... కోహ్లీని గట్టిగా మందలించిన సీఓఏ, భారత్ కెప్టెన్ హోదాలో హుందాగా వ్యవహరించాలని క్లాస్ పీకారట